గ్రీన్ ఫండ్ కోసం ప్రతి నెల 5000 విరాళం- ఎంపీ సంతోష్‌

33

హరిత నిధి ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ శాసన సభలో ప్రకటించిన నేపథ్యంలో ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హరితనిధిని ప్రారంభించారని మరియు ప్రజా ప్రతినిధులందరూ తమ శక్తి సామర్థ్యాల మేరకు సహకరించాలని కోరినందుకు ప్రకృతి ప్రేమికుడిగా హర్షిస్తున్నాను అని ఎంపీ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రకృతి ప్రేమికుడిగా గ్రీన్ ఫండ్ కోసం ప్రతి నెల 5000 విరాళంగా ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.