- Advertisement -
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. పార్టీ కమిటీలను ప్రకటించిన తర్వాతి రోజే సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా బాటపట్టారు. కాంగ్రెస్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ ప్రదేశ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తన కంటే జూనియర్లను నామినేట్ చేశారని ఆరోపించారు. తనను మాత్రం తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా నియమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లో తనను నియమించడాన్ని అవమానపరిచినట్టుగా భావిస్తున్నానని తెలిపారు.
తనకు పదవులు ముఖ్యం కాదు.. ఆత్మాభిమానం ముఖ్యం అని తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన ఏ ఒక్క లీడర్ పేరు కమిటీల్లో లేకపోవడం మనస్థాపాన్ని కలిగించిందన్నారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -