కొండపొలం@ క్లీన్ యూ

77
kondapolam
- Advertisement -

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. వైష్ణవ్ సరసన రకుల్‌ప్రీత్‌ హీరోయిన్ గా నటిస్తోండగా సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు సినిమాకి క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేశారు.

నన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. అటవీ నేపథ్యంలో గొర్రెల కాపరుల జీవిత విధానాన్ని ఈ సినిమాతో కళ్ళకు కడుతున్నారు దర్శకుడు. అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఒబులమ్మగా రకుల్ కనిపించనుండగా కీరవాణి మ్యూజిక్ అందించారు.

- Advertisement -