వాట్సాప్ పేమెంట్స్‌ మరింత సులువుగా..!

77
whatsapp

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ గ‌తేడాది వాట్సాప్ పే ( Whatsapp Pay ) సేవ‌ల‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

ఈ సేవ‌ల‌ను యూజ‌ర్ల‌కు మ‌రింత చేరువ చేయ‌డానికి, సులువుగా పేమెంట్స్ జ‌రిగిపోవ‌డానికి వీలుగా ఇండియ‌న్ రూపీ(₹) సింబ‌ల్‌ను వాట్సాప్ చాట్ బాక్స్‌లో యాడ్ చేసింది.

ప్ర‌స్తుతం పేమెంట్స్ చేయ‌డానికి రెండు ద‌శ‌లు దాటాల్సి ఉండ‌గా.. ఈ తాజా అప్‌డేట్‌తో ఆ ప‌ని మ‌రింత సులువుగా జ‌రిగిపోనుంది. ఇక నుంచి పేమెంట్స్ కోసం కెమెరా యాప్ అన్ని మేజ‌ర్ క్యూఆర్ కోడ్స్‌ను గుర్తించ‌నుంది. యూజ‌ర్లు డ‌బ్బు బ‌దిలీ చేయ‌డానికి, ఆఫ్‌లైన్ పేమెంట్స్ చేయ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డ‌నుంది.