తెలంగాణలో పార్టీ పెట్టాలని ఉవ్విళ్లూరుతున్న వైఎస్ షర్మిలకు ఆదిలోనే షాక్ తగిలింది. గతంలో వైఎస్‌తో సన్నిహితంగా ఉన్న నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న షర్మిలకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
తమ పార్టీలో చేరాల్సిందిగా కొండా మురళి- కొండా సురేఖలను ఆహ్వానించారు షర్మిల. దీంతో వారు కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేయగా షర్మిల వర్గంలో ఆశలు చిగురించగా వాటిపై ఆ సమావేశం వేదికగానే నీరుగార్చారు కొండా దంపతులు.
వైఎస్ షర్మిల పార్టీ నుంచి పిలుపు వచ్చిందని కానీ ఎట్టిపరిస్థితుల్లో రాలేమని చెప్పామని స్పష్టం చేశారు. పార్టీ మారితే వైఎస్ షర్మిల డబ్బు ఇస్తుంది.. కానీ, నాకు విలువలు ముఖ్యం అన్నారు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా.. కాంగ్రెస్‍లోనే కొనసాగుతానని ప్రకటించారు. గతంలో జగన్ ను జైలు నుంచి బయటకు తెచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని కానీ ఆ తర్వాత జగన్ కనీసం పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.