దశాబ్దాల పాటు సాగిన పరాయి పాలన పీడన నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి ఓ మహనీయుడు పదిహేడేళ్ల క్రితం మహా సంకల్సాన్ని చేపట్టారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆయన ఎత్తిన పిడికిలి లక్ష్యాన్నిచేరుకునే దాకా దించలేదు. ఆయనే మన తెలంగాణ బాపు కేసీఆర్. 2001లో ఎగిరిన గులాబీ జెండా నేడు స్వరాష్ట్రంలో సగర్వంగా రెపరెపలాడుతుంది. కొత్త రాష్ట్రం.. ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలు..తెలంగాణ నిలిచి గెలుస్తుందా అంటూ సర్వత్రా అనుమానాలు..కానీ సీఎం కేసీఆర్ దీక్షాదక్షతతో ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేశారు. అనతికాలంలోనే తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. నేడు ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా చేశారు.. నేడు మన తెలంగాణ దేశంలో అన్నిరాష్ట్రాలకు ఆదర్శంగా మారిందంటే అది కేవలం సీఎం కేసీఆర్ సుపరిపాలనే.
నేడు టీఆర్‌ఎస్ 17వ పార్టీ ప్లీనరీకి కొంపల్లిలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది టీఆర్ఎస్ ప్లీనరీ. తెలంగాణలోని 31 జిల్లాల నుంచే కాకుండా 25 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. దాదాపుగా ఒక్కోనియోజకవర్గం నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
ప్లీనరీ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాభైంది. ప్లీనరీ జరిగే కొంపల్లి పింక్ సిటీగా మారిపోయింది. ఎటు చూసిన తెలంగాణ ప్రభుత్వ పథకాలు, కేసీఆర్ కటౌట్లతో నిండిపోయాయి. ఈ ప్లీనరీ వేదికగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. జాతీయ రాజకీయాలపై పార్టీ కేడర్‌కు స్పష్టత ఇవ్వడానికి ఈ వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా వినియోగించుకోనున్నారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు కేడర్ సిద్ధం అయ్యేలా దిశానిర్దేశం చేయనున్నారు.
టీఆర్ఎస్ ఆవిర్భావం..హైలైట్స్
2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ ఆవిర్భావం
2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ పొత్తు
2004 జూన్ 7న రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన
2009 నవంబర్ 29న కేసీఆర్ నిరాహారదీక్ష
2009 డిసెంబర్ 7న సీఎం రోశయ్య అఖిలపక్ష సమావేశం
2009 డిసెంబర్ 9న తెలంగాణపై చిదంబరం ప్రకటన
2009 డిసెంబర్ 23న చిదంబరం రెండో ప్రకటన
2010 డిసెంబర్ 10న శ్రీకష్ణ కమిటీ ఏర్పాటు
2012 డిసెంబర్ 28న కేంద్ర స్థాయిలో రెండో సారి ఆల్‌పార్టీ మీటింగ్, తెలంగాణకు అన్ని పార్టీల మద్దతు
2013 జూలై 30న తెలంగాణకు సీడబ్ల్యూసీ గ్నీన్ సిగ్నల్
2013 డిసెంబర్ 16న టీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ
2014 ఫిబ్రవరి 7న టీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
2014 ఫిబ్రవరి 17న పార్లమెంటులో టీ బిల్లు ప్రవేశం
2014 ఫిబ్రవరి 18న టీ బిల్లుపై చర్చ ప్రారంభం