కాంగ్రెస్ ఐక్యత అంతా డొల్లే..!

46
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ నేతలు కర్నాటక ఎన్నికల విజయం తరువాత తామంతా ఒక్కటేనని తమలో ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ కోసం కలిసి పని చేస్తామని చెబుతున్నారే గాని ఆ మద్య టి కాంగ్రెస్ లో నెలకొన్న ఆదిపత్య విభేదాలు తెలియనివి కావు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరియు పార్టీ సీనియర్ నేతలు చేసుకునే పరస్పర ఆరోపణలు, విమర్శలు.. బహుశా ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా చేసిఉండరేమో. మరి ఆ స్థాయిలో ఉన్న విభేదాలు..ప్రస్తుతం లేవంటే నమ్మడం కష్టమే..

అయితే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా గెలుపొందడంతో తెలంగాణలో కూడా హస్తం పార్టీకి విజయం గ్యారెంటి అనే ఊహాలో ప్రస్తుతం టి కాంగ్రెస్ నేతలు నివురుగప్పిన నిప్పుల విభేదాలను పక్కనబెట్టి ఐక్యత కోరుకుంటున్నారు. అయితే ఎంత ఐక్యత ఉన్న లోలోపల విభేదాలు అలాగే ఉన్నాయని మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరూపించారు. నేడు ఖమ్మం వేధికగా జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది హస్తం పార్టీ. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో చేసిన పోటు.. ఆసక్తికరంగా మారింది.

Also Read:కాంగ్రెస్‌ జనగర్జన..వీరికే ఛాన్స్

ఛలో ఖమ్మం అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు వెంకటరెడ్డి.. ఆ ఆ ఫోటోలో రాహుల్ గాంధీ, భట్టివిక్రమార్క తో పాటు కొత్తగా పార్టీలో చేరబోయే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు జూపల్లి కృష్ణరావు ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ టీపీసీసీ చీఫ్ అయిన రేవంత్ రెడ్డి ఫోటో మాత్రం లేదు. దీంతో కాంగ్రెస్ లో ఆధిపత్య విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని నిరూపితం అయింది. మునుగోడు బైపోల్ టైమ్ లో కోమటిరెడ్డివెంకటరెడ్డి మరియు రేవంత్ రెడ్డి మద్య తారస్థాయిలో విమర్శలు కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అధిష్టానం జోక్యంతో విభేదాలను చల్లార్చే ప్రయత్నం చేసిన.. ఇంకా అలాగే కొనసాగుతున్నాయని కోమటిరెడ్డి తాజా పోస్ట్ తో కన్ఫర్మ్ అయింది. మరి ఈ విభేదాలు ఎన్నికల టైమ్ కి మళ్ళీ రాజుకునే అవకాశం లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -