మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం అవుతా!

3
- Advertisement -

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవుతా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. త్వరలోనే తాను మంత్రిని అవుతానని, లేకపోతే ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతానని ధైర్యంగా ప్రకటించారు.

మునుగోడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ…మీరు మునుగోడును చూసుకోండి… నేను తెలంగాణను చూసుకుంటా అని అన్నారు. పార్టీ తనకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని స్పష్టం చేశారు. మర్యాదగా ఇచ్చిన మాట నిలబెట్టుకుని మంత్రి పదవి ఇవ్వండి. లేకపోతే నేనే లాక్కుంటా అంటూ గట్టిగా హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలపై కొత్త చర్చకు దారితీశాయి. రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారా? లేక పార్టీపై ఒత్తిడి తేవడానికే ఈ వ్యాఖ్యలా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మునుగోడు రాజకీయాల్లో ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్న రాజగోపాల్ రెడ్డి..ఈ ప్రకటనతో మరోసారి వార్తల్లో నిలిచారు. పార్టీ అధిష్టానం దీనిపై ఎలా స్పందిస్తుందో ఆసక్తిగా మారింది.

Also Read:పచ్చి కూరగాయలు తింటున్నారా?

- Advertisement -