కూనంనేని సాంబశివరావు కీలక ప్రకటన

5
- Advertisement -

సీపీఐ రాష్ట్ర నాయకుడు కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ పరిస్థితి ఏర్పడింది. మొత్తం స్థానాల్లో కాంగ్రెస్ 22, సీపీఐ 22, బీఆర్ఎస్ 8, ఇతరులు 6, బీజేపీ 1, సీపీఎం 1 సీట్లు గెలుచుకున్నాయి. ఈ పరిస్థితుల్లో మేయర్ పదవి కోసం కీలక పాత్ర సీపీఐదేనని స్పష్టమైంది.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీపీఐకి మద్దతు ప్రకటిస్తూ, తమ సహకారంతో మేయర్ పదవి ఇవ్వడానికి సిద్ధమని వెల్లడించారు. దీనిపై స్పందించిన కూనంనేని సాంబశివరావు, కేటీఆర్ ఫోన్ చేసి చర్చించారని తెలిపారు. పార్టీ ప్రయోజనాలు, స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ మద్దతుతో మేయర్ పదవి దక్కించుకునే దిశగా ముందుకు సాగుతామని ప్రకటించారు.

Also Read:పచ్చి కూరగాయలు తింటున్నారా?

ఈ ప్రకటనతో కొత్తగూడెం రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. సీపీఐ నిర్ణయం స్థానిక పాలనలో కీలక మార్పులకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -