- Advertisement -
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. ఈ పదవి ఉన్నా ఒకటే పోయినా ఒకటే … నాకు మాత్రం మునుగోడు ప్రజల ప్రాణాలే ముఖ్యం అని తేల్చిచెప్పారు.
ఊరు బయటే వైన్ షాపులు నిర్వహించాలి …బెల్ట్ షాపులకు మద్యం ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు అని హుకుం జారీచేశారు. డే టైంలో పర్మిట్ రూమ్ లలో తాగడానికి వీలు లేదు … అలా అయితేనే టెండర్లు వేసుకోండి అన్నారు.
అలాగే మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులను సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకే తెరవాలి… వైన్ షాపులు ఊరి బయటే ఉండాలి.. అక్కడ కూర్చొని తాగడానికి సిట్టింగ్‌కి పర్మిషన్ ఇవ్వను అన్నారు. బెల్ట్ షాపులకు మందు అమ్మకూడదు.. వైన్ షాపుల యజమానులు అందరూ కలిసి సిండికేట్ చేయొద్దు..ఈ పాలసీలు తెలంగాణ వ్యాప్తంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతాను అన్నారు.
Also Read:BB9:వైల్డ్ కార్డుల ఎంట్రీ..రచ్చరచ్చ
- Advertisement -

