BB9:వైల్డ్ కార్డుల ఎంట్రీ..రచ్చరచ్చ

5
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 36 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా నామినేషన్స్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు నిలిచారు. తొలుత కళ్యాణ్ – మాధురి మధ్య వాగ్వాదం ఆగలేదు. భరణి ఆపాలని చూసినా మాధురి తగ్గలేదు..దీంతో చివరికి కళ్యాణ్ సారీ చెప్పి వెళ్లిపోయాడు.

బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్స్ రాకతో హౌస్‌లో ఆధ్యంతం ఆసక్తికరంగా మారింది. ఉదయం 10 దాటినా ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కాకపోవడంతో కెప్టెన్ కళ్యాణ్‌తో ఫుడ్ మానిటర్ దివ్య కంప్లెయింట్ చేసింది. మాధురి స్నానం చేసిన తర్వాతే వంట చేస్తారని చెప్పారట.. ఇలా అయితే లేట్ అయిపోతుంది అని దివ్య అంది. దీంతో మాధురి తన మాటల యుద్ధాన్ని మొదలు పెట్టింది.

తర్వాత ఆరోవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం ఎవరు నామినేట్ అయి ఈ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయిటికి వెళ్లాలో నిర్ణయించే శక్తి ఫైర్ స్ట్రామ్స్ చేతుల్లో ఉంది.. ఇందుకోసం నేను ఇస్తున్న టాస్క్ బాల్ ఆఫ్ ఫైర్.. అని బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు.ఈ టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలోకి బజర్ మోగగానే ఒక బాల్ వస్తుంది. దాన్ని అందుకొని మళ్లీ బజర్ మోగే సమయానికి ఏ వైల్డ్‌కార్డ్ సభ్యుని దగ్గర ఆ బాల్ ఉంటుందో వాళ్లు ఇంటి సభ్యుల్లో ఒకరిని ఎంచుకొని ఆ బాల్‌ని వాళ్లకి ఇవ్వాలి.. అనేది ఈ టాస్క్.. ఇక బాల్ అందుకున్న హౌస్‌మేట్స్ ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది కానీ ఆ రెండింటిలో ఒక నామినేషన్‌ని మాత్రమే బాల్ ఇచ్చిన వైల్డ్‌కార్డ్స్ ఓకే చేయాలి అని బిగ్‌బాస్ చెప్పాడు. కెప్టెన్ కళ్యాణ్‌తో పాటు వైల్డ్‌కార్డ్స్‌ని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదని బిగ్‌బాస్ అన్నాడు.

ఫస్ట్ రౌండ్‌లో సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు నిఖిల్. తర్వాతి రౌండ్‌లో పోటీ పడి మరీ బాల్ తన దగ్గరే ఉండేలా పట్టు పట్టింది రమ్య. ఆ బాల్‌ని రాము చేతికి ఇచ్చింది. దీంతో రాము.. రీతూ -పవన్.. ఇద్దరినీ నామినేట్ చేశాడు. నెక్స్ట్ పవన్‌ని నామినేట్ చేస్తూ నువ్వు చాలా బాగా టాస్కులు ఆడతావ్.. అలాంటి నువ్వు ఫౌల్ గేమ్ ఆడతావని నేను అనుకోలేదు అని రాము చెప్పాడు. ఇలా ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు నిలిచారు.

Also Read:విజయానికి చేరువలో టీమిండియా

 

- Advertisement -