కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటి ఆయనపై చర్యలకు ఆదేశించింది. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ యే ప్రత్యామ్మాయం అన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారం జరగుతుంది. ఈసందర్భంగా ఆయన నేడు ఢిల్లీకి వెళ్లారు.
బీజేపీ అగ్రనేతలతో ఆయన కలుసుకోనున్నట్లు తెలుస్తుంది. కానీ బీజేపీ ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని, బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తామని బీజేపీ స్పష్టం చేసినట్టు సమాచారం. 2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ, అందుకు వేస్తున్న వ్యూహాల్లో భాగంగా, ఇక్కడి నుంచి ఎంపీల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.
రాష్ట్రం నుంచి పార్లమెంట్ లో ప్రాతినిథ్యాన్ని పెంచితే, ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్లి, తదుపరి ఎన్నికల్లో లాభం కలుగుతుందని భావిస్తున్న బీజేపీ అధిష్ఠానం, ఈ మేరకు కోమటిరెడ్డికి రాజ్యసభ సభ్యుడి పదవిని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. సాయంత్రంలోగా రాజగోపాల్ రెడ్డి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.