సొంతగూటికి కోమటిరెడ్డి.. ?

54
- Advertisement -

నల్గొండ జిల్లా కోమటిరెడ్డి బ్రదర్స్ హవా ఆ మద్య బాగానే నడిచింది. కానీ కాంగ్రెస్ అంతర్గత విభేదాల కారణంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం, ఆ తరువాత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు బైపోల్ లో క్దుయ అనూహ్యంగా ఓడిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే అక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి ఆ తరువాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్ వెంకటరెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ కావడం, ఆయన తరచూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే టాక్ రావడం, ఆయనకు అధిష్టానం నుంచి షోకాజ్ నోటీసులు అందడం ఇలా కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ లో రేపిన అలజడి అంతా ఇంతా కాదు..

కాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళినప్పటికి ఆయన అన్న వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వచ్చారు. అయితే బీజేపీలోకి వెళ్ళిన రాజగోపాల్ రెడ్డికి ఆ పార్టీలో సరైన ప్రదాన్యం లభించలేదు. మునుగోడు బైపోల్ లో కూడా ఓడిపోవడంతో ఆయనను బీజేపీ అసలు పట్టించుకోవడం లేదనే టాక్ నడిచింది. ఇదిలా ఉండగా అనూహ్యంగా కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో హస్తంపార్టీ ఒక్కసారిగా మైలేజ్ పెంచుకుంది. అసలు పోటీలోనే ఉండదని భావించిన హస్తం పార్టీ ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలిచే దిశగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరతారనే టాక్ పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపించింది.

Also Read:ఉదయం లేవగానే ఇలా చేస్తే మంచిది..!

దీనికి తోడు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ పార్టీ వదిలి వెళ్ళిన నేతలు తిరిగి కాంగ్రెస్ లో చేరాలని తగిన ప్రదాన్యం ఇస్తానని చెప్తూ రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు. దీంతో రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుతారా ? అనే చర్చ గట్టిగానే నడిచింది. అయితే పార్టీ మారే ప్రసక్తే లేదని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నప్పటికి.. అంతర్గతంగా ఆలోచనలో పడ్డట్లు టాక్. ఇదిలా ఉంచితే ఆయన బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తన తమ్ముడిని తిరిగి పార్టీలోకి తీసుకోచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్నయ చొరవతో రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరిన ఆశ్చర్యం లేదు. ఒకవేళ నిజంగానే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే.. ఎల్బీ నగర్ నుంచి ఆయనను బరిలో దించే ప్రయత్నంలో వెంకటరెడ్డి ఉన్నారట. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరతాడో లేదో చూడాలి.

Also Read:Modi:అమెరికాకు ప్రధాని

- Advertisement -