రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని అందరికీ తెలిసిన విషయమే. గాలి ఎటు విస్తే అటు వెళుతుంటారు రాజకీయ నేతలు. ఇక ఇటీవల బీజేపీ వీడి తిరిగి సొంత గూటికి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో హస్తం నేతలు గందరగోళానికి లోనవుతున్నారట. గతంలో బీజేపీ నుంచి భారీ మొత్తంలో ముడుపులు అందుకొని స్వలాభం కోసం కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరరానే ముద్రా రాజగోపాల్ రెడ్డి పై ఉంది. 18 వేల కోట్లకు అమ్ముడు పోయారని, వివిధ కాంట్రాక్ట్ లు కేంద్ర ప్రభుత్వం నుంచి కోమటిరెడ్డికి లభించాయని ఇలా రకరాలక వార్తలు వైరల్ అయ్యాయి. ఆ సమయంలో కాంగ్రెస్ లోని చాలమంది నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఆయన కూడా పార్టీపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన తరువాత మునుగోడు ఉపఎన్నికల్లో ఓటమి తప్పలేదు.
ఆ తరువాత కూడా ఆయనకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కలేదు. దీంతో ఆయన బీజేపీ వీడి తిరిగి కాంగ్రెస్ లో చేరతారని గట్టిగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అందరూ ఊహించినట్లుగానే ఆయన బీజేపీ వీడి ప్రస్తుతం మళ్ళీ హస్తం గూటికి చేరారు. ఇప్పుడు ఆయన రీ ఎంట్రీతో కాంగ్రెస్ కు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. నిన్న మొన్నటి వరకు పార్టీ పై తీవ్ర విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి ని తిరిగి పార్టీలో చేర్చుకోవడం వల్ల రేవంత్ రెడ్డి వర్గం కొంత అసహనం గా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికతో మునుగోడు సీటు విషయంలో మళ్ళీ సందిగ్ధత ఏర్పడింది. ఈ సీటు వామపక్షాలకు కేటాయించే దిశగా హస్తం పార్టీ అడుగులు వేస్తున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో తిరిగి మునుగోడు సీటు ఆయనకే కేటాయిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక పూటకో పార్టీ మార్చుతుండడంతో నియోజిక వర్గ ప్రజల్లో కూడా నమ్మకం సన్నగిల్లుతుంది. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి రీ ఎంట్రీ కాంగ్రెస్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.
Also Read:కుంకుమ పువ్వుతో లాభాలు..