కేటీఆర్ మంత్రి కావడం…మన అదృష్టం:కోమటిరెడ్డి

539
komatireddy
- Advertisement -

మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపూర్‌లో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి….ఇండస్ట్రీయల్ పార్కు కోసం రైతులు తక్కువ ధరకు భూములిచ్చి పెద్ద మనసు చాటుకున్నారని తెలిపారు.

తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడ్తయని, మా జీవితాల్లో వెలుగు నింపుతయని ఎంతో ఆశతో కొన్ని లక్షల మంది యువకులు ఎదురుచూస్తున్నరు. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేపట్టిందే ఈ కార్యక్రమం అన్నారు. కేటీఆర్‌లాంటి అనుభవం, అవగాహన ఉన్న వ్యక్తి పరిశ్రమల శాఖ మంత్రి కావడం మన అదృష్టమని రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజల తరపున మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక మౌలిక వసతులతో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో పరిశ్రమలు పెట్టేందుకు వస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు. పారిశ్రామిక వేత్తలందరినీ ఈ వేదిక ద్వారా ఆహ్వానిస్తున్నామని… భూసేకరణ విషయంలో తోడ్పాడునందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -