కోమటిరెడ్డి బ్రదర్స్ vs రేవంత్ రెడ్డి.. మళ్ళీ తెరపైకి?

19
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ మరియు రేవంత్ రెడ్డి మద్య పచ్చ గట్టి వేస్తే భగ్గుమనెంతలా రాజకీయ రగడ కొనసాగింది. రేవంత్ రెడ్డి ఏకపక్ష వైఖరిపై కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఈ రగడ తారస్థాయికి చేరుకున్న సంగతి విధితమే. రేవంత్ రెడ్డి కారణంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడి బీజేపీలో కూడా చేరారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. ఇక కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో తప్పుబడుతూ వచ్చిన సందర్భాలు అనేకం. కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా విజయం సాధించడంతో విభేదాలన్నీ ఒక్కసారిగా మరుగునపడ్డాయి. ప్రస్తుతం కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ విషయంలో ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయడం లేదు. .

కానీ ఆటంర్గతంగా రేవంత్ విషయంలో అన్నదమ్ములు ఇద్దరు ఇంకా అసంతృప్తిగానే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక తాజాగా పార్లమెంట్ ఎన్నికల వేళ కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సస్ రేవంత్ రెడ్డి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కు బాగా పట్టున్న భువనగిరి ఎంపీ టికెట్ ను రేవంత్ రెడ్డి సన్నిహితుడైన చాలమ కిరణ్ కుమార్ కు కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. భువనగిరి స్థానానికి మొన్నటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిథ్యం వహించారు. గతంలో రాజగోపాల్ రెడ్డి కూడా ఈ స్థానంలో ఎంపీగా గెలుపొందిన సంగతి విధితమే.

దీంతో ఈసారి ఎన్నికల్లో వీరు సూచించిన వారికే టికెట్ కేటాయించాలని భావిస్తూ వచ్చారు ఇద్దరు అన్నదమ్ములు. కానీ రేవంత్ రెడ్డి జోక్యంతో ఆ టికెట్ కాస్త చాలమ కిరణ్ కుమార్ రెడ్డికి దక్కింది. ఇదే కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఏ మాత్రం మింగుడు పడడం లేదట. తాము సూచించిన అభ్యర్థికి కాకుండా వేరే వ్యక్తికి టికెట్ కేటాయించడంతో భువనగిరి ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి బ్రదర్స్ దూరంగా ఉండాలని భావిస్తున్నారట. దీంతో అన్నదమ్ములలో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించేందుకు రేవంత్ రెడ్డి తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో ముఖ్య నేతలతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. మరి కోమటిరెడ్డి బ్రదర్స్ అసంతృప్తిని పక్కన బెడతారా ? లేదా గతంలో మాదిరి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే గళం వినిపిస్తారా అనేది చూడాలి.

Also Read:Prabhas:’కల్కి’ వచ్చేది అప్పుడే?

- Advertisement -