కోమటిరెడ్డి బ్రదర్స్ కు తగిన శాస్త్రి

290
- Advertisement -

బ్రదర్స్ కు ముప్పేట నష్టమే
బిజెపిలో మనుగడ సాధ్యమేనా..?
ప్రజాస్వామ్య విలువల పాతర
మానవత్వాన్ని మరచిన రాజగోపాల్
దోపిడీ స్వామ్యానికి జనం చీత్కారం

వ్యాపారాల కోసం రాజకీయాలను పావుగా వాడుకొంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కోమటిరెడ్డి బ్రదరు మునుగోడు ఉప ఎన్నికల్లో తగిన శాస్తే జరిగిందని టి.ఆర్.ఎస్.తోపాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బిజెపిలో చేరి, ప ఎన్నికలు తెచ్చి, కమలం గుర్తుపై పోటీ చేసి, కోట్లాది రూపాయల ఖర్చుతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడించి మునుగోడు ప్రజలు గట్టిగా బుద్ధచెప్పారని ఆ రెండు పార్టీల నాయకులు మండిపడుతున్నారు.

ఆర్థికంగా, రాజకీయంగా సరికొత్త జీవితాలను ప్రసాదించిన తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి తీవ్రస్థాయిలో ద్రోహం చేసింది చాలక చివరకు ఆ పార్టీనే నాశనం చేసి తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయడం కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ అత్యంత దారుణమైన గేమ్ ఆడుతున్నారని, వారిరువురి చర్యలు, కుట్రలనీ ఒక్క మునుగోడు ప్రజలకే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ సంపూర్ణంగా అర్ధమయ్యిందని అంటున్నారు. తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే దుష్టబుద్ది ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహరించిన తీరుపై ఇప్పడు రాష్ట్రంలో వాడీవేడీ చర్చలు జరుగుతున్నాయి.

కోట్లాది రూపాయల డబ్బుపోయిది, పదవులూ పోయాయి, కాస్తోకూస్తో ఉన్న పరువు పోయింది, కొత్తగా చేరిన బిజెపిలోనూ పరువు పోయింది, రాజకీయాల్లో నెగ్గుకు రాలేకపోతే బిజెపిలో మనుగడ సాగించడం దుర్లభమేననే విషయం త్వరలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలిసి వస్తుందని, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మెడపైన కూడా కత్తి వేలాడుతోందని, చివరకు కాంగ్రెస్ పార్టీ కూడా వెంకట్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఇలా కోమటిరెడ్డి బ్రదర్స్ మూడు విధాలుగా చెడ్డారేనే విమర్శలు ఉన్నాయి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసం తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిందే కాకుండా, ఆయనేదో మునుగోడు ప్రజల బాగోగుల కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లుగా, బిజెపిలో చేరినట్లుగా ప్రజలను నమ్మించడానికి పడరానిపాట్లు పడ్డాడని, కానీ అవనీ కాకమ్మ కబుర్లుగా జనం కొట్టిపారేశారని, మొదట్నుంచీ కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో గెలవనని తెలిసి కూడా కేవలం వేల కోట్ల రూపాయల డబ్బు సంపాదించాననే ధనబలంతో, ఎంత ఖర్చు చేసైనా ఓటర్లను కొనుగోలుచేయవచ్చుననే ఏకైక భావంతోనే బిజెపి అబ్యర్ధిగా బరిలోకి దిగాడని నేతలు విశ్లేషిస్తున్నారు.

ఒకవైపు అభివృద్ధి-సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించుకొంటూ ప్రజాపాలన సాగిస్తున్న టి.ఆర్.ఎస్.పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉండగా, టి.ఆర్.ఎస్.పార్టీతో జతకట్టి సి.పి.ఐ, సి.పి.ఎం.పార్టీలు మద్దతు పలకగా బిజెపికి గెలుపు ఎలా సాధ్యమవుతుంది..? అని ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ ధైర్యంగా బిజెపి అభ్యర్థిగా పోటీ చేసింది కూడా కేవలం డబ్బు పొగరు చూసుకునేనని ఆ నాయకులు మండిపడుతున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలకు స్టార్ కాంపెయినర్ గా ఆ పార్టీ అధిష్టానం నియమించిందని, అంతేగాక తాను సూచించిన వ్యక్తి (పాల్వాయి స్రవంతి)కే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇచ్చిందని, అయినప్పటికీ ఆమెను ఓడించి సొంత తమ్ముడైన రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకోవడం కోసం నానా అడ్డదారులు తొక్కినవైనం జుగుప్సాకరంగా ఉందనే విమర్శలున్నాయి.

అంతేగాక రాష్ట్రంలో ఉంటే ఎక్కడా పాల్వాయి స్రవంతి గెలుపు కోసం పనిచేయాల్సి వస్తుందోనని మొహం చాటేసి ఆస్ట్రేలియాకు వెళ్ళిన విషయంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే కాకుండా దాదాపు అన్ని పార్టీల సీనియర్ నాయకులు సైతం కోమటిరెడ్డి బ్రదర్స్ క్యారెక్టర్ ను తూర్పారబడుతున్నారంటే అతిశయోక్తికాదు.

ఎలాగూ రాజకీయాల్లో అవకాశవాదాలే ఎక్కువగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, రాజకీయంగా-ఆర్ధికంగా ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేసిన తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి తీరని ద్రోహం చేసి కనీసం మానవత్వం కూడా లేదని నిరూపించుకొన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ అనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ ఉప ఎన్నికల్లో మునుగోడు ప్రజలు మాత్రం తగిన బుద్ధిచెప్పారని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

బీజేపీకి చెంపపెట్టు ఈతీర్పు:కేటీఆర్‌

నల్గొండ…గులాబీ కంచుకోట

పత్తా లేని చెయ్యి…

 

- Advertisement -