‘అమ్మాయి అందంగా ఉంటుందా?’ అని ఒక సినిమాలో హీరోయిన్ గురించి హీరోని ఫ్రెండ్ అడుగుతాడు. ‘అందంగానా… కోహినూర్ బావా’ అని హీరో బదులిస్తాడు. నిజమే… కోహినూర్ వజ్రాన్ని కథానాయికల్లో చూసుకుంటున్నారు ప్రేక్షకులు. అటువంటి కొత్త కోహినూర్‌లా ముస్తాబయింది కోమలి ప్రసాద్.
ఎవరీ అమ్మాయి? అంటే ‘నెపోలియన్’తో తెలుగు తెరకు పరిచయమైన తెలుగమ్మాయి. అవును… కోమలి ప్రసాద్ తెలుగమ్మాయి. ‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను’ అని ఇండస్ట్రీలో కొందరు చెబుతుంటారు. కోమలి ప్రసాద్ మాత్రం నిజంగానే డాక్టర్. ఆమె డెంటిస్ట్. చదువుతో పాటు నటన అంటే ప్రాణం. చిన్నప్పట్నుంచి పలు స్టేజ్ షోల్లో నటించింది.
తెలుగు తెరపై కథానాయికగా నటించిన తొలి సినిమాతో నటిగా మంచి మార్కులు తెచ్చుకున్న కోమలి ప్రసాద్ ఇప్పుడు మరింత అందంగా ముస్తాబయింది. స్లిమ్‌గా, సెక్సీగా, గ్లామర్‌గా కనిపిస్తూ… కొత్త ఫొటోషూట్స్‌తో కుర్రాళ్ల మనసు దోచుకుంటోంది. మరిన్ని అవకాశాలు అందుకుంటోంది.
ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు కమర్షియల్ సినిమాల్లో కథానాయికగా నటించాలని ప్రయత్నిస్తున్నది.