హీరో విజయ్‌కి గాయాలు..!

266
Hero Vijay injured
- Advertisement -

తమిళ హీరో విజయ్‌కి గాయాలు అయ్యాయి. విజయ్ ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ం పాండిచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కుమార్తె వివాహం జరుగుతున్న వేళ, విజయ్ అక్కడికి వచ్చారు. ఈ పెళ్లికి వచ్చి, వధూవరులను విజయ్ ఆశీర్వదించనున్నారన్న విషయాన్ని ముందుగానే తెలుసుకున్న అభిమానులు, పెద్దఎత్తున కల్యాణ మండపానికి చేరుకున్నారు. విజయ్ కి స్వాగతం పలుకుతూ పోస్టర్లను, కటౌట్లను ఏర్పాటు చేశారు.

Hero Vijay injured

కల్యాణమండపంలోకి తన భార్య సంగీతతో కలసి విజయ్ వెళ్లగానే ఆయన్ను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. చుట్టూ బౌన్సర్లున్నా, వారు అభిమానులను నియంత్రించలేకపోయారు. వధూవరులను ఆశీర్వదించేందుకు ఆయన బయలుదేరిన వేళ, అభిమానుల తోపులాటలో విజయ్ కిందపడిపోయాడు. ఆయన కాలికి దెబ్బ తగిలింది. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఆపై విజయ్‌ ఆయన భార్య సంగీతను సురక్షితంగా అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటన పాండిచ్చేరిలో జరిగింది.

- Advertisement -