హీరో సూర్యకి సహజంగానే పెర్ఫెక్షన్ ఎక్కువ. ఇక దర్శకుడు బాలాకి కొంచెం లైట్ గా చాదస్తం అండ్ తిక్క ఉంటాయి. మరి ఈ పెర్ఫెక్షన్, ఆ చాదస్తం ఎలా సింక్ అవుతాయి అనుకున్నారు వీరిద్దరి సన్నిహితులు. గతంలో అంటే కలిసి సినిమా చేసి ఉండొచ్చు. అప్పుడు సూర్య స్టార్ కాదు. కానీ ప్రస్తుతం సూర్య స్థాయి వేరు, విజన్ వేరు. మరోపక్క బాలా అవుట్ డేటెడ్ డైరెక్టర్. అందుకే.. ఇప్పుడు వీరి మధ్య సింక్ అవ్వలేదు. ఎందుకో తెలియదు, ఈ సినిమా క్వాలిటీ మీద హీరో సూర్య బాగా అసంతృప్తిగా ఉన్నాడు.
గతంలో కూడా సూర్య ఈ సినిమా సీన్స్ లో కొన్నింటిని మార్చుకుంటూ వచ్చారు. రీసెంట్ గానే ఈ సినిమా రఫ్ అవుట్ ఫుట్ చూసి అసహనానికి గురి అయ్యాడట. అప్పుడే ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలోని సీన్స్ పాత వాసన కొడుతున్నాయి. సూర్యకి ఆ సీన్స్ అసలు కనెక్ట్ కాలేదు. డైలాగ్స్, సెట్ లు, కాస్ట్యూమ్స్ వగైరా విషయాలపై సూర్య నేరుగా బాలా దగ్గరే అసంతృప్తి వ్యక్తం చేశాడు.
అన్నిటికీ మించి ఈ సినిమాలో ఒక ఎపిసోడ్ ఉంది. అది పిరియాడిక్ ఎపిసోడ్. హీరో సూర్య దుస్తులు, యాక్ససరీస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ సూర్య కి అసలు కనెక్ట్ కాలేదు. ఒక విధంగా సూర్యకి బాలా కి మధ్య గ్యాప్ పెరగడానికి ముఖ్య కారణం ఈ ఎపిసోడే నట.
ఇవి కూడా చదవండి…