రజినీ పై భారతీరాజ నీచమైన కామెంట్..!

194
Kollywood Director Bharati Raja's abusive comments on Rajinikanth ...
- Advertisement -

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ పై రోజురోజుకు విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. రజినీ పొలిటికల్‌ ఎంట్రీ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే రజినీని టార్గెట్‌ చేశాయి. ఇటు రాజకీయ నాయకుల నుంచే కాకుండా ఫిల్మ్‌ ఇండస్ట్రీలోంచి కూడా రజినీకి విమర్శలు తప్పట్లేదు.

ఏకంగా కమల్ హాసన్ లాంటి పెద్ద స్టార్ హీరో కూడా రజినీపై విమర్శలు గుప్పించడం పెను దుమారమే రేపింది. ఇప్పటికే  ఫ్యాన్సంతా రజినీ పొలిటికల్‌ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా రజినీ కి వ్యతికంగా ఆందోళనలు చేపట్టినా తలైవా ఫ్యాన్స్ వాటిని అడ్డుకోడానికి ప్రయత్నించి మరీ రజినీకి మద్దుతుగా ర్యాలీ నిర్వహించారు.
Kollywood Director Bharati Raja's abusive comments on Rajinikanth ...
ఇదిలా ఉంటే..  మొత్తానికి రజినీకాంత్ పొలిటికల్‌ ఎంట్రీకి రెడీ అవుతోంటే  ఇప్పుడు తమిళనాడు ఉలికి..ఉలికి పడుతోంది.  రజినీ తమిళుడూ కానప్పుడు..అక్కడెలా పోటీ చేస్తావంటూ కోలీవుడ్‌లోని తోటి నటులే అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. కమల్ హాసన్ లాంటి పెద్ద స్టార్ హీరో కూడా రజినీపై విమర్శలు గుప్పిస్తే.. తాజాగా కోలీవుడ్ టాప్ డైరెక్టర్ భారతీ రాజా కూడా రజినీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. భారతీ రాజా చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీశాయి.
Kollywood Director Bharati Raja's abusive comments on Rajinikanth ...అసలు వాటిని విమర్శలనే కన్నా బూతులు వాడాడంటే బాగుంటుందేమో. రజినీపై ఆయన చేసిన వ్యాఖ్యలు అలాంటివి మరి. దిగజారిపోయి అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు .భారతీరాజా. ఫిల్మ్ డైరెక్టర్లు చెన్నైలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అన్న మాటలకు అక్కడకు వచ్చిన వారంతా నిశ్చేష్టులయ్యారు. వాస్తవానికి మే 17న మెరీనా బీచ్‌లో ఈలం వార్ బాధితులకు నివాళిగా సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఆ సభను భగ్నం చేసిన పోలీసులు ఆ ఉద్యమానికి ఆద్యుడైన తిరుమురుగన్ గాంధీని అరెస్ట్ చేశారు.

అతడిని అరెస్టు చేసినందుకు గానూ పోలీసులపై మండిపడిన భారతీరాజా.. రజినీపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. తమిళులు కాని వారు తమపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారన్న భారతీరాజా.. ఆ వ్యాఖ్యలను మరింత అసభ్యంగా మార్చేశారు.

   Kollywood Director Bharati Raja's abusive comments on Rajinikanth ...‘‘తమిళులకు మంచి నేతలు లేరని వారంటున్నారు. తద్వారా వారొచ్చి మమ్మల్ని ఏలాలని చూస్తున్నారు. సరే.. మా తమిళులకు మంచి నేతలే లేరనుకుందాం. మరి, మీరొచ్చి ఏం చేస్తారు..? నా భార్య గర్భవతి కాలేదని  చెప్పి నా బిడ్డకు తండ్రి అవ్వడానికి నువ్వెవరు? ఏ విషయంలోనైనా భాగం అడగొచ్చు. కానీ, నా పడకలోనూ భాగం కావాలని డిమాండ్ చేస్తే ఎలా ఇస్తాను?’’ అంటూ నీచమైన కామెంట్

చేశారు భారతీరాజా. ఈ కామెంట్స్‌ సోషల్‌మీడియాలో హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఆయన చేసిన కామెంట్‌ తో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురై మిన్నకుండిపోయారు. అయితే రజినీ పై విమర్శలు చేయడం పక్కనపెడితే.. మరీ ఇంత నీచంగా మాట్లాడాలా? అంటూ కోలీవుడ్‌ వర్గాల్లో ఓ రేంజ్‌ లో బాహటంగానే చర్చలు మొదలయ్యాయి.

- Advertisement -