2437 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

202
TSPSC Notification 2017 Apply Online
- Advertisement -

గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలు రేపు విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటాచక్రపాణి వెల్లడించారు.  ప్రభుత్వం నుంచి టీఎస్‌పీఎస్సీకి వచ్చిన అన్ని ఇండెంట్లను పూర్తి చేశామని తెలిపారు.గ్రూప్ -1లో 128 పోస్టులకు 256మందిని ఎంపిక చేస్తామని తెలిపారు. గ్రూప్-2 అభ్యర్థులను 1:3 నిష్పత్తి ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తామన్నారు. వెరిఫికేషన్ అనంతరం 1:2 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి టీఎస్‌పీఎస్సీకి వచ్చిన అన్ని ఇండెంట్లను పూర్తి చేశామని తెలిపారు.

2వేల 437 పోస్టులకు 15 నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగాల భర్తీలో దళారుల మాట నమ్మొద్దన్నారు ఘంటా చక్రపాణి.  డీఎస్సీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతి రావొచ్చన్నారు.

పోస్టుల వివరాలు….

డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు : 546

డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు : 21

డిగ్రీ కాలేజీల్లో లైబ్రరీ పోస్టులు : 21

జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ పోస్టులు : 06

జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు : 08

జూనియర్ కాలేజీల్లో లెక్చరల్ పోస్టులు : 152

జూనియర్ కాలేజీల్లో లైబ్రేరియన్ పోస్టులు : 42

రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపల్ పోస్టులు : 304

వెటర్నరీ అసిస్టెంట్స్ పోస్టులు : 541

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ పోస్టులు : 463

(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆర్ అండ్ బీ, గ్రౌండ్ వాటర్, ట్రైబర్ వెల్పేర్ )

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ పోస్టులు : 07

బాయిలర్స్ డిపార్ట్ మెంట్ లో ఇన్ స్పెక్టర్ పోస్టులు : 04

డిప్యూటీ సర్వేయర్ పోస్టులు : 273

డిగ్రీకాలేజీల్లో ప్రిన్సిపల్ పోస్టులు : 30

ఫారెస్ట్ కాలేజీ (ములుగు) ప్రొఫెసర్స్ అండ్ లైబ్రేరియన్స్ పోస్టులు : 19

- Advertisement -