టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్..

127
ipl
- Advertisement -

ఐపీఎల్‌లో నేడు మరో రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆడనున్నాయి.. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం లక్నో జట్టులో ఒక మార్పు చేశారు. గౌతమ్ స్థానంలో అవేష్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. ఇక, కోల్ కతా జట్టులో కీలక బౌలర్ ఉమేశ్ యాదవ్ గాయంతో వైదొలిగాడు. అతడి స్థానంలో హర్షిత్ రాణాను తీసుకుంది.

టోర్నీలో ఇప్పటిదాకా లక్నో, కోల్ కతా జట్ల ప్రస్థానం చూస్తే… లక్నో జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. 10 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు 7 విజయాలు సాధించింది. అటు, కోల్ కతా పరిస్థితి దయనీయం అని చెప్పాలి. 10 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు 6 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. కేవలం నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.

తుది జట్లు :

లక్నో సూపర్ జెయింట్స్‌ : క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కేప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, జేసన్ హోల్డర్, అవేష్ ఖాన్, మొహసిన్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్

కోల్‌కతా నైట్‌రైడర్స్ : బాబా ఇంద్రజిత్ (వికెట్ కీపర్), ఆరోన్ ఫించ్, శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, హర్షిత్ రానా, శివమ్ మావి

- Advertisement -