ట్రెండింగ్‌లో ‘కొమరం భీముడో’ సాంగ్‌..

112
- Advertisement -

ధర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీ విజయం విజయం సాధించింది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాలోని ప్రతి పాట దేనికదే ప్రత్యేకతను .. ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది.

ప్రతి పాట కూడా సందర్భంలో ఒదిగిపోతూ ప్రేక్షకుల మనసులలో ఇమిడిపోతుంది. అలాంటి పాటల వీడియోలను ఒక్కొక్కటిగా పూర్తిస్థాయిలో విడుదల చేస్తూ వస్తున్నారు. అలా తాజాగా ఈ సినిమా నుంచి ‘కొమరం భీముడో’ సాంగును రిలీజ్ చేశారు. కాలభైరవ ఆలపించిన ఈ పాట కథాపరంగా కదిలించివేస్తుంది. ఈ పాటను రిలీజ్ చేసి 24 గంటలు కూడా కాకముందే 4 మిలియన్ కి పైగా వ్యూస్ ను .. 3 లక్షలకు పైగా లైక్స్ ను సాధించింది. యూ ట్యూబ్ లో ఈ సాంగ్ నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ లో నిలిచింది.

- Advertisement -