- Advertisement -
ఐపీఎల్14 సీజన్‌లో మరోసారి కరోనా కలకలం. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌లకు కరోనా సోకింది. దీంతో ఈరోజు రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. అహ్మదాబాద్ మైదానంలో జరగాల్సిన ఈ మ్యాచు రీషెడ్యూలు తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ ఇటీవల గాయపడగా, వారిని స్కానింగ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఈ సందర్భంగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం.
- Advertisement -