మహేందర్‌ను అభినందించిన కోలేటి దామోదర్

467
koleti daomdhar
- Advertisement -

సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికైన మహేందర్‌ని అభినందించారు కోలేటి దామోదర్‌. “ది రే ఆఫ్ హోప్” వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు గట్ల అనిల్ రెడ్డి స్పాన్సర్ చేయగా, సివిల్ కానిస్టేబుల్ పోస్ట్ కు ఎంపికైన వికారాబాద్ కు చెందిన నిరుపేద విద్యార్ధి మహేందర్ ను తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తన కార్యాలయంలో అభినందిస్తూ, ఆయన ఇంకా జీవితంలో పైకెదగాలని అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టుదల వుంటే ఏదైనా సాధించవచ్చని, కష్టాలలో వున్నానని అధైర్యపడకుండా అనిల్ రెడ్డి సహకారంతో శ్రద్ధగా చదువుకుని మహేందర్ పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికై నిరుపేద విద్యార్థులందరికీ ఆదర్శంగా నిలిచారని ఆయన అన్నారు.

“ది రే ఆఫ్ హోప్” స్వచ్చంద సంస్థ అధ్యక్షులు శ్రీ గట్ల అనిల్ రెడ్డిగారు మాట్లాడుతూ మహేందర్ బి.టెక్ చదువుకున్న నిరుపేద విద్యార్థి అని, సహాయం కోసం తనను అర్థించగా, ఆర్థిక సహాయం చేసి అతనిని ప్రోత్సహించడం జరిగిందని, అతను పట్టుదలతో,శ్రద్ధాసక్తులతో చదివి సివిల్ కానిస్టేబుల్ పోస్ట్ కు ఎంపిక కావడం తనకెంతో ఆనందదాయకంగా వుందని అన్నారు.

తమ సంస్థ గురించి వివరిస్తూ శ్రీ అనిల్ రెడ్డి గారు, పేద విద్యార్థులకు సహాయం చేయడానికి ఈ సంస్థను తాము స్థాపించామని, ఎనిమిది మంది విద్యార్థులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తూ, కోచింగ్ ఫీజు, బస్ పాస్ ఇస్తూ చదివిస్తున్న మని అన్నారు. ఇదంతా ప్రభుత్వ సహాయం అపేక్షించకుండా, కేవలం స్పాన్సర్ల సౌజన్యంతో నడుపుతున్నామని ఆయన అన్నారు.

ఇందుకోసం అమెరికాలో ఉంటున్న తమ విద్యార్థులు కూడా వారి స్నేహితుల ద్వారా సహకరిస్తున్నారని అన్నారు. చదువుపై శ్రద్ధాసక్తులు గల పేద విద్యార్థులు ఎవరైనా సరే సహాయం కోసం తమను సంప్రదించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ విద్యార్థులు తరుణ్, రామకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -