తెలంగాణ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మెన్ కోలేటి దామోదర్, జిల్లా యస్.పి భాస్కరన్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన జిల్లా పోలీసు కార్యాలయం మరియు సూర్యాపేట సబ్ డివిజన్ పోలీసు అధికారి కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించినారు.
ఈ సందర్భంగా చైర్మన్ కొలేటి దామోదర్ మాట్లాడుతూ.. జిల్లా పోలీసు కార్యాలయం నూతన భవనాన్ని 6 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చి సేవలను అందిస్తామని అన్నారు. భవనం నిర్మిస్తున్న నేల స్వభావం కారణంగా బేస్ నిర్మాణం ఆలస్యం అయింది అని అన్నారు. ఈ భవనాన్ని 15 కోట్ల వ్యయం అంచనాతో నిర్మిస్తున్నాము అని, DSP కార్యాలయం 70 లక్షల వ్యమతో నిర్మిస్తూన్నాము అని తెలిపినారు. జిల్లా పోలీసు కార్యాలయం యొక్క అనుబంధ ఆర్ముడ్ రిసర్వ్, SP క్యాంప్, అదనపు యస్.పి కార్యాలయాల నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభిస్తాము అని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి దూరదృష్టితో పని చేస్తూన్నారు అని, అనుభవం గల నాయకుడు ముఖ్యమంత్రిగా పని చేయడం మన అదృష్టం అని అన్నారు. తెలంగాణ పోలీసు శాఖను బలోపేతం చేసి దేశంలోనే నెం.1 పోలీసుగా చేశారు అన్నారు. రాష్ట్రం ఏర్పడగానే 375 కోట్ల రూపాయలతో పోలీసు శాఖకు నూతన వాహనాలు అందించి, నూతన భవనాల నిర్మాణానికి, సాంకేతికత వినియోగానికి కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి పోలీసు శాఖకు కేటాయించారు అన్నారు.
తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారు, సాగు, త్రాగు నీటి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రాజక్టులను నిర్మించారు అన్నారు. రాష్ట్రం లో ఆదిలాబాద్, ఇబ్రహీంపట్నం, సిరిసిల్లలో నూతన బాటలియన్స్ ఏర్పాటు చేస్తున్నారు, ఒక్కో బెటాలియన్ నిర్మాణానికి 20 కోట్లు కేటాయించారు అన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయాలను ఆధునికరించారు. 13 నూతన జిల్లాల పోలీసు కార్యాలయాలకు, 2 కమిషనరేట్ కార్యాలయాలకు 375 కోట్లు మంజూరు చేసినారు అన్నారు.
గచ్చిబౌలి వద్ద రాచకొండ కమిషనరేట్ కోసం 56 ఎకరాల భూమి కేటాయించారు అన్నారు. పంజా గుట్ట పోలీసు స్టేషన్ దేశంలోనే ప్రాచుర్యం పొందినది. 13 జిల్లా పోలీసు కార్యాలయాలు, 2 కమిషనేరేట్‌లు నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నవి. దేశంలోనే అత్యున్నత పోలీసింగ్ నిర్వహిస్తునారు అన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యములో తెలంగాణ పోలీసు బాగా పని చేస్తున్నారు, శాంతి భద్రతల విషయంలో దేశంలో తెలంగాణ పోలీసులను నెం.1 గా ఉంచిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్‌దే అని అన్నారు.
ప్రజలకోసం అనుక్షణం పని చేస్తూ తెలంగాణ పోలీసు లను దేశంలో అత్యున్నతంగా ఉంచడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున కృషికి రాష్ట్ర పోలీసుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ఛైర్మెన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థకు -2015-16 ఆర్ధిక సంవత్సరానికి గాను 136.34 కోట్లు, 2016-17 ఆర్ధిక సంవత్సరానికి గాను 186.08 కోట్లు, 2017-18 ఆర్ధిక సంవత్సరానికి గాను 180.12 కోట్లు, 2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను 196.25 కోట్లు రూపాయలను కేటాయించారు అని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసు హౌసింగ్ EE అబ్దుల్ ఖుద్దుస్ హుస్సేనీ, DE విఠల్ సింగ్, AE బాలరాజు, రిజర్వ్ ఇంస్పెక్టర్ గోవిందరావు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
Telangana Police Housing Corporation Chairman Koletti Damodar, District Superintendent of Police, Bhaskaran, inspected the construction work of the new District Police Office..