నయనతార.. భారీ హిట్ కొట్టింది..

391
Kolamavu Kokila
- Advertisement -

నయనతార.. ఈమె జీవితమే ఎగుడుదిగుడుగా సాగింది. ఇప్పటికి ముగ్గురితో సాగించిన ప్రేమాయణం తీరాలకు చేరలేకపోయింది. మొదట శింబుతో సాగించిన ప్రేమ డీప్‌గా సాగి నయన్‌ను డిప్రెషన్ లోకి నెట్టింది. తర్వాత ప్రభుదేవ కూడా ఇలానే షాక్ ఇచ్చాడు. ఇక ముచ్చటగా ఇప్పుడు మూడో ప్రేమలో నయన మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే.

ఇలా ప్రేమ వ్యవహారాల వల్లే నయన్ చాలా సినిమా అవకాశాలు కోల్పోయింది. నయన్‌ను తమిళనాట అగ్రహీరోలు తమ సినిమాల్లోకి తీసుకోవడం లేదు. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. లేడి ఓరియెంటెడ్ మూవీలు ఆమెకు వరుసగా వస్తున్నాయి. అంతేకాదు అవి భారీ విజయాన్ని కూడా అందుకుంటున్నాయి.

Nayanthara

నయన్‌ తాజా చిత్రంగా రూపొందిన ‘కొలమావు కోకిల’ నిన్ననే తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కథా భారాన్ని నయనతార పూర్తిగా తనపై వేసుకుని ముందుకు నడిపిస్తూ వెళ్లింది. తొలిరోజునే ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చేసుకుంది.నయనతార నటన పట్ల అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘లేడీ సూపర్ స్టార్’ అనే బిరుదును ఈ సినిమాతో ఆమె సార్థకం చేసుకుందంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. 25 కోట్ల రూపాయల ఖరీదు చేసే డ్రగ్స్‌ను తన కుటుంబ సభ్యులతో కలిసి నయనతార ఎలా తరలించిందనే కథాంశంతో ఈ సినిమా కొనసాగుతుంది. కావలసినంత కామెడీని కలుపుకుని సాగే థ్రిల్లర్ మూవీ ఇది. త్వరలో ‘కో కో కోకిల’ అనే పేరుతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -