- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొని ఆలయ సంప్రోక్షణ చేశారు. ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ నిర్వహిస్తామని చెప్పారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉండటంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేశారు.
- Advertisement -