టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్. ఆటగాడిగా అత్యున్నత దశలో ఉన్న కోహ్లీకి మర్యాద తెలియదన్నారు. పెర్త్ టెస్టులో కోహ్లీ ప్రవర్తన దారుణమని..కోహ్లీ ఓ చెత్త కెప్టెన్ అని విమర్శలు గుప్పించాడు.
బుధవారం మీడియాతో మాట్లాడిన జాన్సన్ అంతర్జాతీయ క్రికెట్‌లో మ్యాచ్ ముగిశాక గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రత్యర్థి జట్టు ఆటగళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం సహజమేనని కానీ పెర్త్ టెస్టులో ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్‌కు కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అమర్యాదగా ప్రవర్తించారని తెలిపారు. జట్టును విజేతగా నిలిపిన పైన్ కళ్లలోకి కూడా చూడకపోవడం సిల్లీగా అనిపించిందన్నారు.
టిమ్ పైన్ బెస్ట్ కెప్టెన్‌గా వ్యవహరిస్తే.. కోహ్లీ చెత్త కెప్టెన్‌గా నడుచుకున్నాడని విమర్శలు గుప్పించాడు. బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా సైతం కోహ్లీది అత్యంత చెత్త ప్రవర్తన అని విమర్శించిన విషయం తెలిసిందే.