లక్ష్మీస్ ఎన్టీఆర్..ఫస్ట్ లుక్‌ ఎప్పుడో తెలుసా..!

206
laxmis ntr
- Advertisement -

నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా రాంగోపాల్ వర్మ ఓ సినిమా తెరకెక్కిస్తున్స సంగతి తెలిసిందే. ఈ సినిమాకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ ఖరారు చేసిన వర్మ వచ్చే ఏడాది రిలీజ్ చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు.

తాజాగా ఫస్ట్ లుక్ తేదీని ప్రకటించారు వర్మ. వెన్నుపోటు అనే పాట ఫస్ట్‌లుక్‌ను డిసెంబర్‌ 21 సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటింరు.

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత చోటు చేసుకున్న సంఘటనలతో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నారు. ముంబై వ్యాపారవేత్త బాలగిరికి చెందిన జీవీ ఫిల్మ్స్‌ సంస్థ సమర్పిస్తోన్న సినిమాను రాకేశ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఇప్పటికే బాలయ్య-క్రిష్ కాంబినేషన్‌లో ఎన్టీఆర్ మూవీ శరవేగంగా తెరకెక్కుతోంది. రెండు పార్టులగా తెరకెక్కుతుండగా సినీ జీవితం నేపథ్యంలో జనవరి 9న కథానాయకుడు విడుదల కానుండగా ఫిబ్రవరిలో రాజకీయ నేపథ్యంలో మహానాయకుడు రిలీజ్ కానుంది. మొత్తంగా సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్‌ ఎలాంటి సందడి చేస్తుందో వేచిచూడాలి.

- Advertisement -