పరుగుల వీరుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు.అంతర్జాతీయ క్రికెట్‌లో తక్కువ మ్యాచ్‌లలో16వేల పరుగులు పూర్తిచేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. మొత్తం 360 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి (మూడు ఫార్మాట్‌లలో కలిపి) అతడు ఈ ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఆమ్లా (363) మ్యాచ్‌లలో ఈ ఫీట్ సాధించగా కోహ్లి దీనిని అధిగమించాడు.
ఇక టెస్టుల్లో ఐదు వేల పరుగుల్ని వేగవంతంగా సాధించిన నాలుగో భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. శ‍్రీలంకతో మూడో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ మార్కును చేరుకున్నాడు. కోహ్లి కంటే ముందుకు సునీల్ గావస్కర్(95 ఇన్నింగ్స్‌లు), వీరేంద్ర సెహ్వాగ్(98 ఇన్నింగ్స్‌లు), సచిన్ టెండూల్కర్(103) ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల పరుగుల్ని వేగవంతంగా పూర్తి చేసిన భారత ఆటగాళ్లు. కోహ్లి 105 టెస్టుల్లో ఈ ఘనతను సాధించాడు.
ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ అర్ధసెంచరీలు సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు కోహ్లి. 20 హాఫ్ సెంచరీలతో కోహ్లీ టాప్ ప్లేస్‌లో నిలవగా రాహుల్ ద్రావిడ్(19),గంగూలీ(17),ధోని(15)హాఫ్ సెంచరీలతో తర్వాతి స్ధానాల్లో నిలిచారు.
Runs are easy if you're Virat Kohli!
16000 international runs in 350 innings, beating Amla who got there in 363 #INDvSL pic.twitter.com/O9c4IqA0JG
— Cricbuzz (@cricbuzz) December 2, 2017