టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ ఆడతారా ? లేదా అనే సందేహాలు గత కొన్నాళ్లుగా వ్యక్తమౌతున్నాయి. 2019 వరల్డ్ కప్ తరువాత టీ20 మ్యాచ్ లకు దూరంగా ఉంటున్న ఈ ఇద్దరు… ఇక వన్డేలకు కూడా దూరమయ్యే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రిక టూర్ లో కేవలం టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే ఆడనున్న ఈ స్టార్ ఆటగాళ్లు వన్డేలు, టీ20 మ్యాచ్ లకు ఆల్రెడీ దూరంగా ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఏడాది జూన్ నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అందువల్ల ఇప్పటి నుంచే జట్టు కూర్పు పై దృష్టి సారించాల్సిన అసవరత ఉందనేది క్రీడా విశ్లేషకుల అభిప్రాయం.
ప్రస్తుతం టీ20 విభాగంలో కుర్ర ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్.. ఇక ప్రతి ప్లేయర్ టీ20 లలో తిరుగే లేదని నిరూపించుకుంటున్నారు. ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ తరువాత ఆసీస్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను యువ టీం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ డిసెంబర్ లో సౌతాఫ్రికా తో మరో మూడు టీ20 మ్యాచ్ లు అడనుంది. ఆ తరువాత అఫ్గానిస్తాన్ జట్టుతో మరో టీ20 సిరీస్ అడనుంది. టీ20 వరల్డ్ కప్ కు ముందు ఈ రెండు జట్ల తోనే టీ20 సిరీస్ లు అడనుంది టీమిండియా.. ఇప్పటికే సౌతాఫ్రికాతో జరిగే టీ20 మ్యాచ్ లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆల్రెడీ దూరమయ్యారు. ఆ తరువాత అఫ్గానిస్తాన్ తో జరిగే సిరీస్ కు కూడా దూరమైతే టీ20 వరల్డ్ కప్ లో రోహిత్, కోహ్లీ ఆడడం కష్టమే అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
Also Read:సింగరేణిలో మోగిన ఎన్నికల నగారా