వన్డే ప్రపంచకప్‌లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదుచేసింది భారత్. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కోహ్లీ అదిరే సెంచరీకి తోడు రోహిత్, గిల్ రాణించడంతో 41.5 ఓవర్లలోనే 261 పరుగులు చేసి విక్టరీ కొట్టింది.
కోహ్లీ 97 బంతుల్లో 4 సిక్స్‌లు, 6 ఫోర్లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా శుభ్‌మన్ గిల్ 2 సిక్స్‌లు, 5 ఫోర్లతో 53 పరుగులు, రోహిత్ శర్మ 2 సిక్స్‌లు,7 ఫోర్లతో 48 పరుగులతో రాణించారు. ఇక కోహ్లీతో కలిసి మరో వికెట్ పడకుండా కేఎల్ రాహుల్ (34)తో లక్ష్యాన్ని పూర్తి చేశారు.
అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. తన్జీద్ హసన్ (51),లిటన్ దాస్ (66)హాఫ్ సెంచరీలతో రాణించగా మహ్ముదుల్లా (46) పరుగులు చేయడంతో బంగ్లా 250 పరుగులు చేయగలిగింది. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read:పిండం..థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్