‘గని’ నుండి తమన్నా స్పెషల్‌ సాంగ్‌ రిలీజ్‌..

124
- Advertisement -

మెగాప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గని’. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని రెనైస్సాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మించారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ కథానాయిక కాగా, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి తాజాగా “కొడ్తే” అంటూ సాగే హుషారైన గీతం పూర్తి వీడియోను విడుదల చేశారు. ఈ పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా తన అందాలతో ఆకట్టుకుంది. తమన్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. హారికా నారాయణ్ ఆలపించారు.

- Advertisement -