మాజీ స్పీకర్ కోడెల కన్నుమూత..

981
kodela
- Advertisement -

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆత్మహత్యాకు ప్రయత్నించగా బసవతారకం ఆస్పత్రిలో చికిత్ర పొందుతూ మృతి చెందారు.ఆయనకు ఒక కూతురు,ఇద్దరు కుమారులు ఉన్నారు.  హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో ఊరి వేసుకున్నట్లుసమాచారం. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల….ఎన్టీఆర్,చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు.

గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీచేసిన కోడెల వైసీపీ నేత అంబటి రాంబాబు చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి ఆయన కష్టాలు మొదలయ్యాయి. కుమారుడితో పాటూ కుమార్తెపై కేసులు నమోదయ్యాయి. ఈ చిక్కుల నుంచి బయటపడక ముందే అసెంబ్లీ ఫర్నీచర్ వివాదంతో పాటు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు మాయం చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు కోడెల. ఆయన కోలుకుంటుండగానే ఆరోపణలు తీవ్రం కావడంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

- Advertisement -