అడ్డగోలు హామీలతో అరచేతిలో వైకుంఠం:కేటీఆర్

7
- Advertisement -

అడ్డగోలు హామీలిచ్చి, అరచేతిలో వైకుంఠం చూపెట్టి మంచిగున్న తెలంగాణను రేవంత్ రెడ్డి ఆగమాగం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోరాటం ఒక ఎత్తైతే.. కోడంగల్ లో మరొక ఎత్తు అన్నారు.

రేవంత్ లాంటి దుర్మార్గుడితో తలపడుతూ ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటున్న పట్నం నరేందర్ రెడ్డిని అభినందించారు. కొడంగల్‌లో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్‌ పార్టీలో చేరికల సందర్భంగా మాట్లాడారు కేటీఆర్.

రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్‌ పార్టీలోకి చేరారు. కొడంగల్ మండల కాంగ్రెస్ మాజీ ఎంపీపీ దయాకర్ రెడ్డి, బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ నర్మదా మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు.

Also Read:ప్రజా పాలన అంటే.. ఇదేనా రేవంత్ రెడ్డి?

- Advertisement -