- Advertisement -
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. ముందుగా యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం శ్రీ సీతారామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆ తరువాత యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ఉత్సవమూర్తులను, ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణంగా సన్నిధికి చేర్చడం, కుంభా ఆవాహన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
Also Read:యాక్షన్ థ్రిల్లర్ చిత్రంతో కీర్తి సురేష్
- Advertisement -