నిజామాబాద్‌ బరిలో కోదండరాం..?

285
kodandaram
- Advertisement -

మరోసారి ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురైన తర్వాత కంటికి కూడా కనబడని కోదండరాం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్ధానాల్లో బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తమ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని… తాము పోటీలో లేని చోట కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని కోదండరాం ప్రకటించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా కోదండరామ్‌ ఈ సారి లోక్ సభ ఎన్నికల బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బరిలో దిగితే మద్దతిచ్చేందుకు సిద్ధమైంది కాంగ్రెస్‌. నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ స్ధానం నుండి పోటీ చేసేందుకు మాజీ ఎంపీ మధుయాష్కీ ఆసక్తి చూపడం లేదు. మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి సైతం పోటీకి విముఖంగా ఉండటంతో ఇక్కడి నుండి కోదండను బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

కోదండరాం..కల్వకుంట్ల కవిత ఫై పోటీ సై అంటాడా..ఇప్పుడు ఇదే చర్చ గా మారింది. అసెంబ్లీ మహాకూటమి తో పొత్తు పెట్టుకున్న కోదండరాం ..టీజేఎస్ తరపున ఏడుగురు అభ్యర్థులను బరిలో నిలిపారు. అయితే వారు గెలవడం సంగతి పక్కనపెడితే కనీసం డిపాజిట్ కూడా రాబట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే బరిలో కోదండరాం నిలుస్తాడా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.

- Advertisement -