TTD:హంస వాహనంపై కోదండరాముడు

16
- Advertisement -

తిరుపతి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శ‌నివారం రాత్రి 7 గంట‌ల నుండి హంస వాహనంపై శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

Also Read:టిల్లు కోసం వస్తున్న దేవర!

- Advertisement -