నోటా కోసం కాంగ్రెస్,బీజేపీ పోటాపోటీ..!

67
Kodali Nani

మరోసారి కాంగ్రెస్,బీజేపీలకు చురకలంటించారు ఏపీ మంత్రి కోడాలి నాని. తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొడాలి నాని…తిరుపతిలో బీజేపీ నోటాతో పోటీ పడుతోందని.. టీడీపీ కుప్పకూలి పోయింది దాని గురించి చెప్పుకోవటం అనవసరం అంటూ ఎద్దేవా చేశారు.

దేవినేని ఉమని ఉప ఎన్నికల్లో ఇంఛార్జ్‌గా వేసి చంద్రబాబు ఏం సాధించాలి అనుకుంటున్నారు? అంటూ ప్రశ్నించిన ఆయన.. సొంత నియోజకవర్గంలో సర్పంచులను కూడా గెలిపించుకోలేకపోయిన వ్యక్తి దేవినేని ఉమ.. అలాంటి వ్యక్తి తిరుపతిలో టీడీపీని గెలిపిస్తాడంట అంటూ మండిపడ్డారు. జగన్నాథ రథచక్రాలను ఆపాలనుకుంటే చంద్రబాబు జీవితం సరిపోదన్న కొడాలి.. టీడీపీ డిపాజిట్లు గల్లంతు అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు.

తిరుమలలో తలనీలాలు స్మగ్లింగ్ చేస్తున్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని …దేవుడిసొమ్ము కోసం కక్కుర్తి పడాల్సిన పని సీఎం వైఎస్ జగన్‌కు లేదన్నారు.. దేవుడిపై అపార ప్రేమ, నమ్మకం జగన్ సొంతమన్న కొడాలి నాని…… అందుకే, ఏ మీటింగ్ లోనైనా దేవుని దయ, ప్రజల ఆశీస్సులతో పని చేద్దామని సీఎం జగన్‌ అంటారని గుర్తుచేశారు.