ముల్లదోసకాయతో ఎన్ని లాభాలో తెలుసా!

48
- Advertisement -

దోసకాయ అనేది కూరగాయలలో ఒకటనే సంగతి అందరికీ తెలిసిందే. దీని వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనలు ఉన్నాయనే సంగతి కూడా మానందరికి తెలుసు. కానీ దోసకాయలలోనే చాలా రకాలు ఉన్నాయి. అందులో ముల్లదోసకాయ అనే రకం కూడా ఒకటి, దీనిని కివానో పండు అని కూడా అంటారు. ఇది మూడు సీజన్ లలోనూ పండించడానికి అనువైన పంట. ఈ ముల్లదోసకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి మరియు ఏ వంటి వాటితో పాటు పొటాషియం, మెగ్నీషియం, ఇనుము వంటి సూక్ష్మ ధాతులులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు మెండుగా ఉంటాయి. .

తద్వారా సీజనల్ గా వచ్చే జలుబు, ఇన్ ఫ్లూయెంజా వంటి శ్వాసకోశ వ్యాధులు రాకుండా సహాయ పడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారికి ఇది సంజీవినిగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులోని పీచు పదార్థం జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుందట. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి డయాబెటిస్ ను అరికట్టడంలో సత్ఫలితాలను ఇస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.

ఇందులో ఉండే విటమిన్ సి శరీర నిర్మాణంలో ప్రధానంగా సహాయపడే కొల్లాజన్ తంతువుల తయారీలో సహాయపడుతుందట. ఈ కివానో పండును నిరంతరం తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్, క్యాన్సర్ వంటి రుగ్మతలను కూడా దూరం చేస్తుందట. ఇంకా ఇందులో ఉండే ఇనుము హిమోగ్లోబిన్ పెరుగుదలకు సహాపడతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఈ కివానో పండులో లూటీన్, లైకోఫీన్, బీటా కెరోటిన్ వంటివి కూడా ఉంటాయి. ఇవి జన్యు పరమైన మార్పులను సరిచేయడంలో తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. మరి మరి మార్కెట్ కు వెళ్లినప్పుడు ఈ కివానో పండు లేదా ముల్లదోసకాయ దొరికితే అసలు వదలకండి.

Also Read:ఆకాశదీపం అంటే ఏంటో తెలుసా ?

- Advertisement -