బోయపాటిపై రఘుబాబు సెటైర్‌..!

221
Kittu Unnadu Jagratha Raghu Babu Character Intro Teaser
- Advertisement -

ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ న‌టిస్తున్న  చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`. డ‌బ్బు కోసం కుక్క‌ల‌ను కిడ్నాప్ చేయ‌డ‌మే కాకుండా, ప్రేమ కోసం రాజ్ తరుణ్ చేసే అల్లరే ఈ చిత్రం. చిత్రం ఫస్ట్ లుక్ దగ్గరి నుంచి ట్రైలర్ వరకు అందరి అంచనాలను దాటేసింది. ట్రైలర్‌లో కామెడీ, రొమాంటిక్, మాస్ ఎలిమెంట్స్ ని చూపిస్తూ భారీ హైప్ క్రియేట్ చేయగా తాజాగా కమెడీయన్ రఘుబాబు డైలాగ్‌తో విడుదల చేసిన వీడియో అందరిని ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో రఘుబాబు .. బోయపాటి మీద సెటైర్ వేయటం అందరికీ నవ్వులు తెప్పిస్తోంది. ఈ సినిమాలో రఘు  ఒక బాబా పాత్రను పోషిస్తుండగా అతని అసిస్టెంట్ గా వెన్నెల కిషోర్ కనిపిస్తాడు. ఈ బాబా పాత్ర మాట్లాడుతూ.. ”నేను నరకడం మొదలుపెడితే.. నదులు నీటితో కాదు రక్తంతో ప్రవహిస్తాయి” అంటూ ఒక డైలాగ్ చెప్పి.. ”దీనిని శీనుకు పంపించు” అంటాడు. వెంటనే వెన్నెల కిషోర్ స్పందిస్తూ.. ”తివిక్రమ్ శ్రీనుకా.. వైట్ల శ్రీనుకా బాబా?” అన అడగ్గా.. ”బోయపాటి శ్రీనుకు” అంటూ పంచ్ వేస్తాడు ఆ బాబా. మొత్తానికి బోయపాటి మీద అలా కామెడీ పండించేశారు.

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి వంటి హిస్టారిక‌ల్ సినిమాకు సంభాష‌ణ‌లు రాసిన‌ రైట‌ర్ సాయిమాధ‌వ్ బుర్రా ఈ సినిమాకు ఫ‌న్నీ డైలాగ్స్‌ను అందించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రంలో న‌టిస్తుండ‌టం విశేషం.

- Advertisement -