53 సెంటర్స్ లో 50 కొట్టిన 150..

157
Khaidi No.150 50 Days Centers
- Advertisement -

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన ఖైదీ తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. 53 సెంటర్స్ లో 50 రోజులను పూర్తి చేసుకుంది.

సీడెడ్ లో 20 థియేటర్స్ లోను .. వైజాగ్ లో 17 .. గుంటూరులో 4 .. కృష్ణాలో 3 .. నెల్లూరులో 3 .. తూర్పు గోదావరిలో 2 .. పశ్చిమ గోదావరిలో 2 .. నైజాంలో 1 .. కర్ణాటకలో 1 చొప్పున ఈ సినిమా 53 థియేటర్స్ లో 50 రోజుల మైలురాయిని చేరుకొని 100 రోజుల దిశగా పరుగులు తీస్తోంది. ఒక సినిమా 50 రోజులను పూర్తి చేసుకోవడం అరుదుగా జరుగుతోన్న ఈ రోజుల్లో, మెగా మూవీ ఈ ఫీట్ ను సాధించడం అభిమానులకి మరింత ఆనందాన్ని కలిగిస్తోంది.

ఖైదీ నెం 150 తర్వాత చిరు తన నెక్స్ట్ ప్రాజెక్టులపై దృష్టి సారించాడు. 151గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నాడు. చిరంజీవి 151వ సినిమా తొలి స్వాతంత్ర్య సమరయోధుడైన  ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ కథతో తెరకెక్కనుంది. దీని తర్వాత చిరు మెగా బ్రదర్ పవన్‌తో కలిసి మల్టీ స్టారర్‌ సినిమాలో నటించనున్నట్లు నిర్మాత సుబ్బిరామిరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తంగా వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసేందుకు చిరు వస్తున్నాడు.

- Advertisement -