కిష్కింధపురి..వసూళ్ల జోరు!

7
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా చిత్రం కిష్కిందాపురి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా దుమ్మురేపుతోంది. భారీ అంచనాలు ఉన్న మిరాయ్ సినిమాతో పాటు రిలీజ్ కావడంతో కిష్కిందాపురికి పెద్ద పోటీ ఎదురవుతుందని కొందరు భావించారు. కానీ ఈ హారర్ థ్రిల్లర్ అంచనాలను తలకిందులు చేస్తూ, కలెక్షన్లతో సత్తా చాటుతోంది.

₹32 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, సుమారు ₹28 కోట్ల నాన్-థియేట్రికల్ రెవెన్యూ ద్వారా ఎక్కువ భాగం పెట్టుబడిని రికవరీ చేసింది. థియేట్రికల్ రైట్స్ విలువ ₹8 కోట్లు కాగా, సినిమా ఓపెనింగ్ వీకెండ్‌లోనే ₹15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో బ్రేక్ ఈవెన్ ఈరోజుకే పూర్తవుతుందని, డిస్ట్రిబ్యూటర్లు లాభాలు పొందబోతున్నారని ట్రేడ్ టాక్.

రాక్షసుడు తర్వాత సరైన హిట్ దక్కని బెల్లంకొండ శ్రీనివాస్, సమయం తీసుకుని తనను తాను మళ్లీ నిరూపించుకుని ఈసారి బలమైన కంటెంట్‌తో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు. నిర్మాత సాహు గరపాటికీ లైలా తర్వాత మళ్లీ విజయపథంలోకి రావడానికి ఈ సినిమా దోహదపడింది.

Also Read:ఐటీఆర్ గడువు పొడిగింపు..ఫేక్ న్యూస్

ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఓజీ వచ్చే వరకు ఈ సినిమాకు మంచి రన్ ఉంటుందని, ట్రేడ్ విశ్లేషకులు సినిమా ఫుల్ రన్‌లో సుమారు ₹30 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కిష్కిందాపురి ఆ అంచనాలను మించుతుందో లేదో చూడాలి.

- Advertisement -