బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, బండి

13
- Advertisement -

తెలంగాణ నుండి కేంద్రమంత్రులుగా ఎన్నికైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఢిల్లీలో ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్ బొగ్గు, గనుల శాఖ కార్యాలయంలో ఈ సందర్భంగా ఆయన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీజేపీ తెలంగాణ నేతలు పాల్గొన్నారు.

దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పనిచేస్తానని కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో బొగ్గు కొరత లేకుండా చూస్తామని…దేశంలో మోదీ ప్రభుత్వం విద్యుత్ కొరత లేకుండా చూస్తోందని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బండి సంజయ్‌కు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి ఆశీస్సులు అందించారు.

Also Read:OMG..రిలీజ్ డేట్ వచ్చేసింది!

- Advertisement -