ఏ శాఖ ఇచ్చిన సమర్ధవంతంగా పనిచేస్తా:కిషన్ రెడ్డి

10
- Advertisement -

తనకు ఏ శాఖ ఇచచిన సమర్ధవంతంగా పనిచేస్తానని తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రెండోసారి మోడీ కేబినెట్‌లో చోటు దక్కడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కేబినెట్ మంత్రిగా పనిచేశానని, ఇప్పుడు రెండోసారి కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందని చెప్పారు.

రాజకీయంగా తనను విభేదించి.. కామెంట్లు చేసే మూర్ఖులను అసలు పట్టించుకోనన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు టెక్ట్స్‌టైల్ పార్కు, రైల్వే ప్రాజెక్టులు , కేంద్ర సంస్థలు తీసుకొచ్చానని వెల్లడించారు. తనను ఎంపీగా గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన కిషన్ రెడ్డి…తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.

Also Read:Gunasekhar:యుఫోరియాలో కాల భైరవ

- Advertisement -