బాధితులకు అండగా ఉంటాం: కిషన్ రెడ్డి

126
kishan reddy
- Advertisement -

వినాయకనగర్ లో ఇటీవల అరకు ఘాట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 8 మందికి మెరుగైన చికిత్స అందించాలని ఏపీ సీఎస్‌ , హెల్త్ సెక్రెటరీ,జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు కిషన్ రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి….అరకు ప్రమాదం ఈ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది…వైజాగ్ లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్న అన్నారు.ట్రావెల్ కంపెనీపై కేసు నమోదుచేసి యాక్షన్ తీసుకోవాలని అధికారులకు చెప్పా….బాధితులకు అండగా ఉంటాం అన్నారు.

- Advertisement -