ట్విట్టర్ బ్యాచ్ పై కుర్ర హీరో ఫైర్

45
- Advertisement -

సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఏమైనా చెప్పుకునే స్వాతంత్ర్యం వచ్చినట్టైంది. సినిమా రిలీజ్ రోజు క్రిటిక్స్ కంటే ముందే ఆడియన్స్ ట్వీట్ చేస్తూ ట్విటర్ లో సినిమా టాక్ చెప్పేస్తున్నారు. అయితే ప్రతీ దానిలో పాజిటివ్ తో పాటు నెగెటివ్ కూడా ఉంటుంది. ఈ నెగెటివ్ కొన్ని సార్లు మరీ ఎక్కువవుతుంది కూడా. ఇదే కుర్ర హీరో కిరణ్ అబ్బవరం కి కోపం తెప్పించింది.

అసలు తన సినిమా రిలీజ్ రోజే సినిమా బాలేదు అంటూ ట్విటర్ లో ఓ బ్యాచ్ ట్వీట్స్ చేస్తున్నారని హీరో వాపోయాడు. ఎక్కడో పూణే నుండి తన సినిమా చూడకుండానే ట్వీట్స్ వేస్తున్నారని చెప్పుకున్నాడు. తనని ఇండస్ట్రీ నుండి పంపాలకుంటున్నారని , అయితే అది జరగని పని అంటూ చెప్పుకున్నాడు. తనని ఎంకరేజ్ చేయాలి తప్ప ఇలా నెగెటివ్ స్ప్రెడ్ చేసి ఏం సాదిస్తారని ప్రశ్నించాడు కిరణ్.

ఇక నెపోటిజం అంటూ మాట్లాడే వాళ్ళే తన లాంటి కొత్త వారిని ఎంకరేజ్ చేయకుండా నెగటివ్ పోస్టులు పెడుతూ తమని ఇబ్బంది పెడుతున్నారని తెలిపాడు. ఇండస్ట్రీ సపోర్ట్ బాగానే ఉంది మీరే మమ్మల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ నెటిజన్ల మీద విరుచుకు పడ్డాడు. అయితే ఈరోజుల్లో నెటిజన్లు ప్లస్ లు మైనస్ లు చెప్పడం కామనే. కానీ ఎందుకో కుర్ర హీరోకి బాగా మండింది. అందుకే వినారో భాగ్యము విష్ణు కథ సక్సెస్ లో ఎలా రెచ్చిపోయి ట్విటర్ బ్యాచ్ పై కామెంట్స్ చేశాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -