మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల పెళ్లిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. గతంలో నిహారిక పెళ్లి త్వరలోనే చేస్తామని చెప్పారు నాగబాబు. దీంతో తాజాగా నిహారిక సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తుంటే పెళ్లి కుదిరినట్లే అనిపిస్తుంది. స్టార్ బక్స్ కాఫీ కప్ మీద మిస్ నీహ అని రాసి ఉండగా.. s కొట్టేసి..Mrs అనే దానిపై రైట్ మార్క్ వేసింది. మళ్లీ ఓ ట్విస్ట్ కూడా చేసింది. మిస్టర్స్ అనే పదం చివర క్వశ్చన్ మార్క్ కూడా పెట్టింది.
దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి ఉహ్.. వాట్? అని కామెంట్ చేసింది. నిహారికకు కాబోయే భర్త గుంటూరుకు చెందిన అతను అని తెలుస్తుంది. గుంటూరుకు చెందిన ఓ గవర్నమెంట్ అధికారి కొడుకుని వివాహం చేసుకోనుందట. దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమచారం. కాగా నిహరిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో హీరోయిన్ పాత్రలకు గుడ్ బై చెప్పేసింది. ఇదంతా చూస్తుంటే తొందర్లోనే మెగా ఫ్యామిలీలో మరో పెళ్ళి జరుగనున్నట్లు తెలుస్తుంది.